గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్యతో తీయనున్న కొత్త సినిమా

గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్యతో  తీయనున్న కొత్త సినిమా

బాలకృష్ణ 50 ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణాన్ని ఇటీవలే పూర్తి చేసుకున్నారు. వరుస విజయాలతో హ్యాట్రిక్‌ హీరోగా, హ్యాట్రిక్‌ పొలిటీషియన్‌గా తన సత్తా ఏమిటో చాటుకున్నారు. 60 ప్లస్‌లోనూ క్షణం తీరిక లేకుండా బిజీ నటుడిగా, పొలిటీషియన్‌గా గడపడం బాలయ్యకే చెల్లు. ప్రస్తుతం ఆయన కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని దీపావళి రోజున ప్రకటిస్తారు. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా యాక్ట్ చేయనున్నారని సమాచారం. బాలకృష్ణ మార్క్‌ డైలాగులు ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ముఖ్యంగా ‘సింహం నక్కలమీదకు వస్తే వార్‌ అవ్వదురా.. హంటింగ్‌’ అనే డైలాగ్‌ జనబాహుళ్యంలో బాగా వినిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే, ఆ తర్వాత వచ్చే ‘అఖండ 2’ విజయం నల్లేరు మీద నడకే అని చెప్పాలి. ఈ సారి డబుల్‌ హ్యాట్రిక్‌ పక్కాగా ఉంటుందనే బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. బాలయ్యకు త్వరలో ఓ గొప్ప గౌరవం దక్కబోతోందని తెలుస్తోంది. కళాకారుడిగా, సంఘ సేవకుడిగా ఆయన సుదీర్ఘ ప్రయాణానికి తగిన గౌరవం దక్కబోతున్నట్టు సమాచారం.

administrator

Related Articles