ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్‌లు విలన్లుగా నటిస్తున్నారంటూ ఓ వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో గుప్పుమంటోంది. దీనిపై ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పింది కరీనాకపూర్. ఇప్పటివరకూ ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన వారు ఏ ఒక్కరూ మమ్మల్ని కలవలేదు. మా మధ్య చర్చలు జరిగాయి అన్నది కూడా పుకార్లు మాత్రమే. ఇంతకీ సౌత్ సినిమాలో నటించాలని ఉన్న కోరిక మాత్రం నిజమే. అయితే.. నా యాక్టింగ్‌కు తగ్గ పాత్ర రావాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తాను. ఆ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉండాలి. అలాంటి పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది కరీనాకపూర్.

- October 21, 2024
0
32
Less than a minute
Tags:
You can share this post!
administrator