ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాల షూటింగుల్లో హీరో ప్రభాస్ బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రభాస్ తాను చేస్తున్న రెండు సినిమాలను ముగించే వరకూ సందీప్‌రెడ్డి సైలెంట్‌గానే ఉంటారట. ‘స్పిరిట్’ లొకేషన్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాక, ఇక పూర్తిగా తన ఆధీనంలోనే ఉండాలనే షరతుని ప్రభాస్ ముందుంచారట సందీప్‌రెడ్డి వంగా. ఇంకా ప్రభాస్ ముందు ఆయన ఉంచిన షరతులు ఇలా ఉన్నాయి. ‘స్పిరిట్’ పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదు. ఆ లుక్‌తో బయట కనిపించకూడదు. వారానికి ఒకరోజో, రెండు రోజులో కాల్షీట్లు ఇస్తే కుదరదు.. బంచ్‌గా కాల్షీట్లు ఇవ్వాలి. బాడీ డబుల్స్‌పై ఆధారపడి షాట్లు తీయను.. నా లొకేషన్‌లో డూప్ ప్రస్తావన రాకూడదు..’ ఇవీ సందీప్‌రెడ్డి కండిషన్లు. హీరో అనేవాడు సందీప్‌రెడ్డి వంగాకి సరెండర్ అయితే.. అతను ఎలాంటి ఔట్‌పుట్ ఇస్తాడో.. అర్జున్‌రెడ్డి, యానిమల్ సినిమాలు చెప్పేశాయి. అందుకే ప్రభాస్ కూడా ‘సరే’ అన్నారట. ప్రస్తుతం ఈ షరతుల చిట్టా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.

- March 12, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor