సీక్వెల్స్‌లో తొలి పార్ట్ సినిమా మంచి హిట్ అయి సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కూడా జరుగుతోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో చూస్తే సీక్వెల్స్ ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా తక్కువ. దాంతో సీక్వెల్ అంటే తెలుగువాళ్లకి ఓ పక్కా ప్లాన్ ఉంటుంది అనే ఫీలింగ్ జనంలో బలంగా నాటుకుపోయింది. బాహుబలితో సీక్వెల్ ట్రెండ్ తెలుగులో మొదలైంది. తొలి పార్ట్ కన్నా రెండో పార్ట్‌కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక పుష్ప విషయంలోను అదే రిపీట్ అయింది. బన్నీ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప రెండో భాగం, దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఘన విజయం సాధించింది. చిన్న సినిమాల స్థాయిలోనూ టాలీవుడ్ సీక్వెల్ గేమ్ స్ట్రాంగ్‌గానే ఉంది. సీక్వెల్ అనగానే స్కేల్ పెంచి హంగామా చేయకుండా కథని ఇంకాస్త స్ట్రాంగ్‌గా చూపించడంతో మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ ట్రెండ్ ఇతర ఇండస్ట్రీలు అమలు చేయలేకపోతున్నాయి. ఇక మలయాళంలో చూస్తే లూసిఫర్‌కి సీక్వెల్‌గా వచ్చిన ఎంపురాన్ అంత రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. అయితే కన్నడలో కేజీఎఫ్ సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ 2 బలంగానే కొట్టింది. ఇది పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ మంచి విజయం సాధించింది.

- March 29, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor