‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే.!

‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడే.!

ఓటీటీ ప్రియుల‌కు పరిచ‌యం అక్క‌ర్లేని వెబ్ సిరీస్‌ల‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఒక‌టి. మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి లీడ్ రోల్‌లో న‌టించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వ‌చ్చి అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు న‌మోదు చేసింది. స్పై, థ్రిల్లర్‌గా వ‌చ్చిన ఈ సిరీస్‌ను దర్శకద్వయం రాజ్ & డీకే తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి సీజ‌న్ 3 రాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సిరీస్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు న‌టుడు మనోజ్‌ బాజ్‌పాయ్. పాతాల్ లోక్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు జైదీప్‌ అహ్లావత్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. జైదీప్ ఈ ప్రాజెక్ట్ కోసం 2 ఏళ్ల ముందు నుండే ఇందులో జాయిన్ అయ్యాడు. కానీ ఈ విష‌యం ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు. ఇందులో ఆయ‌న పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతుంది. సీజ‌న్ 3 విష‌యానికి వ‌స్తే.. నవంబ‌ర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుందంటూ మ‌నోజ్ చెప్పుకొచ్చాడు. సీజ‌న్ 3 ఎక్కువ‌గా నార్త్ ఈస్ట్ ఇండియాలో బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ స‌వాళ్లను శ్రీకాంత్‌ ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సీజ‌న్ 3 వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే.

editor

Related Articles