జులైలో ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడు

జులైలో  ‘తమ్ముడు’  వచ్చేస్తున్నాడు

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘తమ్ముడు’. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఆదివారం దర్శకుడు శ్రీరామ్‌ వేణు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్‌ వీడియోను కూడా విడుదల చేశారు. ఇక ఈ వీడియో విషయానికొస్తే.. సినిమాలోని ప్రధాన తారలైన స్వసిక విజయన్‌, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, సీనియర్‌ నటి లయ, బేబీ శ్రీరామ్‌ ఆదిత్య ఒక్కొక్కరుగా దర్శకుడు శ్రీరామ్‌ వేణు దగ్గరకు వస్తారు. వీరంతా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకే తన దగ్గరకు వస్తున్నారని శ్రీరామ్‌ వేణు అనుకుంటారు. కానీ వాళ్లు ‘తమ్ముడు’ రిలీజ్‌ ఎప్పుడు? ప్రమోషన్స్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు? అంటూ శ్రీరామ్‌ వేణుపై ప్రశ్నలను సంధిస్తారు. సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న లయ.. చివరిలో నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ రావడం, శ్రీరామ్‌వేణు బర్త్‌డే కేక్‌ కట్‌ చేయడం.. జూలై 4న ‘తమ్ముడు’ రిలీజ్‌ అని అనౌన్స్‌ చేయడంతో వీడియో ముగిసింది. ఈ సినిమాకి సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌.

editor

Related Articles