సోమవారం రిలీజైన ‘సగమై..చెరిసగమై’.. సాంగ్

సోమవారం రిలీజైన ‘సగమై..చెరిసగమై’.. సాంగ్

మంచు విష్ణు టైటిల్‌ రోల్‌లో భక్తిరస ప్రధానంగా రూపొందుతున్న సినిమా ‘కన్నప్ప’. పరమ శివభక్తుడు కన్నప్ప ఇతివృత్తమిది. ఏప్రిల్‌ 25న విడుదలకానుంది. సోమవారం ఈ సినిమా నుండి ‘సగమై… చెరిసగమై’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. స్టీఫెన్‌ దేవస్సీ స్వరాల్ని అందించిన ఈ గీతాన్ని రేవంత్‌, సాహితీ చాగంటి ఆలపించారు. శ్రీమణి రచించారు. ఈ పాటలో నాయకానాయికలు మంచు విష్ణు, ప్రీతి ముకుందన్‌ల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ శివుడిగా, ప్రభాస్‌ రుద్రుడిగా, కాజల్‌ అగర్వాల్‌ పార్వతీదేవిగా కనిపించనున్నారు. మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

editor

Related Articles