నా ప్రియుడితో సినిమా చేస్తే బాగోద‌ని వార్నింగ్ ఇచ్చిన రష్మిక?

నా ప్రియుడితో సినిమా చేస్తే బాగోద‌ని వార్నింగ్ ఇచ్చిన రష్మిక?

ఛ‌లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారింది ర‌ష్మిక మందన్న. అయితే ఈ హీరోయిన్ కొద్ది రోజులుగా విజ‌య్ దేవ‌ర‌కొండతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌నే పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇద్ద‌రూ ఒకేచోట క‌లిసి క‌నిపిస్తుండ‌డంతో అంద‌రూ అనుమానిస్తున్నారు. అయితే రష్మిక- విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో ఓ హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. సప్త సాగరాలు దాటి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఫేమ‌స్ అయిన‌ రుక్మిణికి తెలుగులో కూడా పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నాయి. విజ‌య్, ర‌ష్మిక ప్రేమ‌లో ఉండ‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో రుక్మిణిని న‌టించ‌వ‌ద్దని కోరింద‌ట‌. ఇక ఈ సినిమా దిల్ రాజ్ నిర్మాణ సారధ్యంలో రవి కిషన్ కోలా డైరెక్షన్‌లో రూపొందుతోంది. రౌడీ జనార్ధన్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు లీక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించినప్పటికీ ఆమె మాత్రం నో చెప్పిందని అంటున్నారు. అయితే ఈ సినిమా నుండి త‌ప్పుకుని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా అవకాశం అందుకున్నారని, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఉన్నారని తెలుస్తోంది. కన్నడ హీరో రక్షిత్‌శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

editor

Related Articles