రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బ్లాక్‌బస్టర్ ‘మర్దానీ’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు 2019లో సీక్వెల్‌గా ‘మర్దానీ 2’ విడుదలైంది. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి. ‘మర్దానీ 2’ విడుదలై శుక్రవారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీరాయ్ పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ‘మర్దానీ-3’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాం. పోలీస్ డ్రెస్ వేసుకొని అద్భుతమైన పాత్ర చేయడం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఆ పాత్ర ద్వారా మీనుండి అమితమైన అభిమానాన్ని పొందాను. సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ, బాధ్యతానిర్వహణలో ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని పోలీసులకు ఈ సినిమా అంకితం. అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రచన: ఆయుష్ గుప్తా, నిర్మాత: ఆదిత్య చోప్రా.

- December 14, 2024
0
22
Less than a minute
You can share this post!
editor