ప్రస్తుతం ఈ భామ ఏడు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ చిత్రాల భారీ సక్సెస్‌తో త్రిష దశ మారిపోయింది. వరుసగా అగ్ర హీరోల చిత్రాలను అంగీకరిస్తూ బిజీబిజీగా మారింది. తాజాగా ఈ భామ అగ్ర హీరో సూర్య 45వ చిత్రంలో కథానాయికగా ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సూర్య నటిస్తున్న 45వ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూర్య-త్రిష జోడీ విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరు కలిసి నటిస్తుండటం విశేషం. త్రిష ప్రస్తుతం విశ్వంభర, థగ్‌లైఫ్, బ్యాడ్ అండ్ అగ్లీ వంటి భారీ చిత్రాల్లో వరుసపెట్టి యాక్ట్ చేస్తోంది.

- December 14, 2024
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor