మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ ‘ది రెడ్ బ్యాగ్’ ప్రస్తుతం మంచి బజ్‌ను సొంతం చేసుకుంటోంది. బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికర కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన రాశీ ఫస్ట్ లుక్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ‘సావిత్రి’ పాత్రలో Raashi ఎంతో సింపుల్ గెటప్‌లో కనిపించినా, ఆమె లుక్‌లోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథలో కీలక మలుపు తీసుకొచ్చే పవర్‌ఫుల్ పాత్రలో రాశీ నటించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ టీజర్‌ను సిద్ధం చేస్తున్నారు. టీజర్ విడుదలతో సినిమాపై మరింత బజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి సినిమానే అయినా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

