చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా కూడా సూపర్ ఫేం సంపాదించింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ సినిమాలో యలినా జమాలి పాత్రలో నటించిన సారా అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం సుమారు 1300 మందిని ఆడిషన్ చేసిన తర్వాత సారాను ఎంపిక చేసినట్లు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా వెల్లడించారు. ఇప్పటికే ఫేమస్ అయిన హీరోయిన్ల కంటే కొత్త ముఖం అయితేనే పాత్రకు బాగా సెట్ అవుతుందని భావించి సారాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో సారా అర్జున్ ఇండియావైడ్‌గా క్రేజ్ సంపాదించింది. సినిమా విజయానంతరం సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేస్తూ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. చిన్న వయసులోనే నటిగా పేరు తెచ్చుకున్న సారా, ఇప్పుడు హీరోయిన్గా మరో మైలురాయిని అందుకుంది.
- May 19, 2026
0
13
Less than a minute
You can share this post!
editor

