‘లీలావతి’గా అదిరిపోయిన అనసూయ లుక్..!

‘లీలావతి’గా అదిరిపోయిన అనసూయ లుక్..!

Anasuya Bharadwaj కీలక పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Abhishek Nama దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన అనసూయ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘లీలావతి’ పాత్రలో ఆమె పవర్‌ఫుల్‌గా, మిస్టీరియస్‌గా కనిపిస్తోంది. తెలుపు చీరలో ట్రైబల్ జ్యువెలరీతో కనిపించిన ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాత్ర కథలో ఎంతో కీలకమనే సంకేతాలు పోస్టర్ ద్వారా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, జగపతి బాబు, మహేష్ మాంజ్రేకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పౌరాణికం, చరిత్ర, యాక్షన్ అంశాల కలయికగా రూపొందుతున్న ‘నాగబంధం’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related Articles