అఫీషియ‌ల్‌గా వార్ 2 రిలీజ్ డేట్ ఆగస్ట్ 14..

అఫీషియ‌ల్‌గా వార్ 2 రిలీజ్ డేట్ ఆగస్ట్ 14..

దేవర తర్వాత వార్‌ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్‌తో క‌లిసి నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపుల‌కి నిర్మాతలు పులిస్టాప్ పెట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ ‘వార్ 2’ సినిమా గురించి ప్రస్తావించాడు. దీనిపై సదరు నిర్మాణ సంస్థ స్పందిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే అద్భుతంగా సెటప్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటింది. ఇద్ద‌రు ప‌వ‌ర్ ఫుల్ హీరోస్ తెర‌పై జంట‌గా క‌నిపిస్తే ఆ సంద‌డి పీక్స్‌లో ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ ప‌ర్‌ఫార్మెన్స్ చూడ‌డానికి రెండు క‌ళ్లు స‌రిపోవు అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుండో ప్రచారం సాగుతోంది.

editor

Related Articles