భయానక గుహలో మిస్టరీ… ‘అగధ’ స్టోరీపై ఆసక్తి..?

భయానక గుహలో మిస్టరీ… ‘అగధ’ స్టోరీపై ఆసక్తి..?

Agadha ఒక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఆసక్తికరమైన చిత్రం. ప్రముఖ దర్శక నిర్మాత M. S. Raju ఈ సినిమాతో మరో యూనిక్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

ఇటీవల విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. చీకటి గుహలో 12 చేతుల విగ్రహం, భయానక వాతావరణం, మిస్టిక్ ఎలిమెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని విభిన్న లొకేషన్లలో 85 రోజులు చిత్రీకరించారు. దాదాపు 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్ ఉండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

మిక్కిన్ అరుల్ దేవ్ సంగీతం, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటించి సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు..!

Related Articles