అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి టీజర్ విడుద‌ల‌..

అర్జున్‌ సన్నాఫ్  వైజయంతి టీజర్ విడుద‌ల‌..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెర‌కెక్కిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ డ్రామాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోంది. కర్తవ్యం సినిమాలో విజయశాంతి పేరు వైజయంతి కాగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే పేరు పెట్టారు. ఈ సినిమాలో విజ‌య‌శాంతి ఐపీఎస్ ఆఫీసర్ గానే కనిపిస్తుంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టని వైజయంతి కొడుకు విషయంలో ఏం చేసింది అనే కోణంలో సాగే కథలా సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్‌ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. 10 ఏళ్ల నా కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతీసారి నా కళ్ల ముందు కనిపించే ముఖం.. నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొద‌లైంది. విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించగా.. ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. నెక్స్ట్ బర్త్ డే నాటికి పోలీస్‌గా ఖాకీ డ్రెస్‌లో చూడాలని వైజయంతి తన కొడుకుని కోరుతుంది.

editor

Related Articles