ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని.. ఇప్పుడు ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అలాగే, ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

- March 17, 2025
0
58
Less than a minute
Tags:
You can share this post!
editor