‘షష్టి పూర్తి’ సినిమా ఈ నెల 30న రిలీజ్

‘షష్టి పూర్తి’ సినిమా ఈ నెల 30న రిలీజ్

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘షష్టి పూర్తి’. పవన్‌ప్రభ దర్శకుడు. రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని, ‘లేడీస్‌ టైలర్‌’ విడుదలైన 38 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్‌, అర్చన కలిసి నటించడం, ఎం.ఎం.కీరవాణి తొలిసారి ఇళయరాజా స్వర సారథ్యంలో పాట పాడటం సినిమాకు ప్రధానాకర్షణలుగా నిలిచాయని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు శ్రోతల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని, వింటేజ్‌ ఇళయరాజా మ్యూజిక్‌ విన్న ఫీల్‌ ఉందనే ప్రశంసలొస్తున్నాయని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి కెమెరా: రామ్‌, సంగీతం: ఇళయరాజా.

editor

Related Articles