‘సిద్ధులాంటి హీరోతో పనిచేయడం ఏ దర్శకుడికైనా ఈజీయే. ప్రతీ సీన్‌ను అద్భుతంగా పండిస్తాడు. ఈ సినిమా విషయంలో రైటింగ్ స్టేజీ నుండే సిద్ధు బాగా ఇన్‌వాల్వ్ అయ్యాడు. జాక్ క్యారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్‌లో సిద్ధుకే స్వేచ్ఛనిచ్చాను’ అన్నారు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘జాక్-కొంచెం క్రాక్’. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ నెల 10న విడుదల కానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మనలో ప్రతీ ఒక్కరిలో జాక్ ఉంటాడని, ఆ జాక్ ఎవరనేది ఎవరికి వాళ్లే తెలుసుకోవాలని, ఈ సినిమాలో భావోద్వేగాలతో పాటు చక్కటి సందేశం ఉంటుందని బొమ్మరిల్లు భాస్కర్ అన్నారు. టిల్లు ఏ మీటర్‌లో ఉంటుందో అంతకు మించి జాక్ పాత్ర ఉంటుందని తెలిపారు. బొమ్మరిల్లు భాస్కర్ వంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉందని, సిద్ధు నుండి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని హీరోయిన్ వైష్ణవి చైతన్య చెప్పింది. భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, రథన్, అచ్చు రాజమణి.

- April 4, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor