మన తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కొన్ని సినిమాల్లో హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అజ్ఞాతవాసి’ కూడా ఒకటి. గత 2018లో వచ్చిన ఈ సినిమా మిగిల్చిన జ్ఞాపకాలు ఒక్క పవన్ అభిమానులకే కాదు టాలీవుడ్ ఆడియెన్స్‌కి కూడా బాగా గుర్తుంటాయి. అయితే ఈ సినిమా ట్యాగ్ ఇపుడు మళ్ళీ వైరల్‌గా మారింది. ఇదివరకే ఒకసారి వచ్చిన అజ్ఞాతవాసి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవ్వడం చూసి ఒకింత పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవన్ అజ్ఞాతవాసి కాదు ఇదే టైటిల్‌తో మరో సినిమా వస్తోంది. అది కూడా మన సౌత్ నుండే కావడం విశేషం. కన్నడ సినిమా నుండి అజ్ఞాతవాసిగా ఓ యూత్ ఫుల్ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్‌కి రాగా మళ్ళీ ఈ టైటిల్ వైరల్‌గా మారింది. దీంతో ఆ అజ్ఞాతవాసి వేరు ఈ అజ్ఞ్యాతవాసి వేరు అని చెప్పాలి.

- April 4, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor