కోలీవుడ్‌కి ‘పుష్ప 2’తో మాంచి కిక్ ఇచ్చిన సుకుమార్.. త‌మిళ తంబీలు ఖుష్‌..

కోలీవుడ్‌కి ‘పుష్ప 2’తో మాంచి కిక్ ఇచ్చిన సుకుమార్.. త‌మిళ తంబీలు ఖుష్‌..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒక‌రిగా సుకుమార్ పేరు వినిపిస్తుంది. ఆయ‌నని లెక్క‌ల మాస్టారు అని అభిమానులు పిలుచుకుంటారు. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన సుకుమార్ ఇటీవ‌ల పుష్ప‌2 చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసింది. ఇప్పుడు సుకుమార్ పెద్ద హీరోల‌తోనే సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుకుమార్ తమిళనాట జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. పుష్ప సినిమాలో హీరో పాత్ర ఓ రియల్ స్మగ్లర్ నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసినట్లు ఈ సంద‌ర్భంగా సుకుమార్ స్ప‌ష్టం చేశారు. తాను ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ వెబ్ సిరీస్ తీయాలనుకున్నప్పుడు పుష్పరాజ్ అనే ఓ స్మగ్లర్‌ను కలిశానని.. అతడి పేరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో అత‌డిని ఇంట‌ర్వ్యూ కూడా చేశాన‌ని అన్నారు. అయితే పుష్ప అనే పేరు ఆడ‌వారికి పెడ‌తారు కాని ఓ స్మ‌గ్ల‌ర్ ఇలాంటి పేరుతో ఉండ‌డం త‌న‌ను ఎట్రాక్ట్ చేసింద‌ని చెప్పుకొచ్చారు. పుష్ప అనే ఓ స్మగ్లర్ కారణంగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిందని ఆయన ఇప్పుడు రివీల్ చేయడంతో అభిమానులు షాక్‌కు గురౌతున్నారు. పుష్ప లాంటి ఊర మాస్ సబ్జెక్ట్‌తో తమిళంలో సినిమా చేస్తే ఎవరితో చేస్తారని సుకుమార్‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి ఏమాత్రం ఆలోచించకుండా కార్తీతో చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పేశారట సుకుమార్. కార్తీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా త‌నకి ఇష్ట‌మ‌ని కితాబు ఇచ్చారు. కార్తీతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదలుకోనని సుకుమార్ చెప్పడంతో కోలీవుడ్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట.

editor

Related Articles