ఎన్నో విజయవంతమైన సినిమాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికీ సుపరిచితుడైన ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. ప్రముఖ కమెడియన్, నటుడు ప్రవీణ్ త్వరలోనే బకాసుర రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నారు.. అనే న్యూస్ అందరిలోనూ కాస్త ఆసక్తి కలిగించి వైరల్‌గా మారింది. అయితే ప్రవీణ్ నటుడిగా బిజీగానే ఉన్నాడు కదా.. మరీ వ్యాపారంలోకి ఎందుకు వెళ్లుతున్నాడు అనే సందేహం కూడా అందరిలో కలిగింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ న్యూస్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ప్రవీణ్ ఎటువంటి రెస్టారెంట్‌ను పెట్టడం లేదు.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా పేరు ‘బకాసుర రెస్టారెంట్’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రవీణ్ పెద్ద గరిటెతో వంట చేస్తుండటం.. ఆ పక్కనే ఇతర పాత్రలు ఆ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్‌లోనే గమనిస్తే వైవా హర్ష, షైనింగ్ ఫణి మరోవైపు విచిత్రంగా సమ్‌థింగ్ స్పెషల్ పాత్రలుగా కనిపిస్తున్నారు.
- May 2, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

