దర్శకుడిగా కరుణాకరన్ పొటెన్షియాలిటీ ఏంటో చెప్పడానికి తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మూడు సినిమాలు చాలు. సాయిదుర్గతేజ్‌తో చేసిన ‘తేజ్ ఐలవ్యూ’ తర్వాత ఆయన నుండి సినిమా రాలేదు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత కరుణాకరన్ మెగాఫొన్ పట్టనున్నారట. దిల్‌రాజు తమ్ముడి కుమారుడైన ఆశీష్ కోసం ఓ కథను సిద్ధం చేశారట కరుణాకరన్. ఆశీష్‌కు కూడా కథ బాగా నచ్చిందట. ఇక దిల్‌రాజుకు నచ్చడమే తరువాయి. త్వరలోనే దిల్‌రాజుకు కథ వినిపిస్తారట కరుణాకరన్. ఆయనకు నచ్చితే ఏప్రిల్ నుండి షూటింగ్‌ని ప్రారంభించే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేమకథలను తెరకెక్కించడంలో కరుణాకరన్ సిద్ధహస్తుడు.

- February 28, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor