యాక్షన్‌, కామెడీ, రివెంజ్‌, హర్రర్‌ సినిమా

యాక్షన్‌, కామెడీ, రివెంజ్‌, హర్రర్‌ సినిమా

హర్రర్‌, యాక్షన్‌, కామెడీ, రివెంజ్‌ అంశాలతో కూడిన సినిమా ఇది. నా పాత్రలో పెద్ద హీరోయిజం ఏమీ ఉండదు. ఓ కొత్త హీరోకి ఇంతకంటే మంచి డెబ్యూ దొరకదు.’ అని విరాజ్‌రెడ్డి చీలం ఆన్నారు. ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘గార్డ్‌’. ‘రివెంజ్‌ ఫర్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. మిమీ లియానార్డ్‌, శిల్పా బాలకృష్ణ హీరోయిన్లు. జగ పెద్ది దర్శకుడు. అనసూయారెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో హీరో విరాజ్‌ రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ‘మాది నిజామాబాద్‌. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే సెటిల్‌ అయ్యాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్‌ స్కూల్‌కి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలోనే తీశాం. సినిమా ఆస్ట్రేలియాలో తీసినా ఇది అసలు సిసలైన తెలుగు కథ. తొలి సినిమా హర్రర్‌ జానర్‌ అయితే తేలిగ్గా ప్రేక్షకులకు చేరువకావచ్చని ఈ సినిమా చేశాను. అని విరాజ్‌రెడ్డి తెలిపారు.

editor

Related Articles