బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా సికందర్ నుండి నిర్మాతలు తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. కోలీవుడ్ దర్శకుడు ఎఆర్ మురుగదాస్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘సికందర్’. జైహో సినిమా తర్వాత ఎఆర్ మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రానుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సినిమా నుండి గ్లింప్స్‌ను వదిలిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదిలింది. నాన్నమ్మ అతడికి సికందర్ అని పేరు పెట్టింది. తాత ఏమో సంజయ్ అని పేరు పెట్టాడు. కానీ ప్రజలు మాత్రం అతడిని రాజాసాబ్ అని పిలుస్తారు అంటూ టీజర్ మొదలైంది. ఈ టీజర్ చూస్తుంటే.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఈ సినిమాలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు.

- February 27, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor