మలయాళీ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ఎల్2 ఎంపురాన్. ఈ సినిమాకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. మంజు వారియర్, టోవినో థామస్, ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా లుసిఫర్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మలయాళ సినిమాలోనే ఆల్‌టైం కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సినిమా రచయిత మురళీ గోపీ స్పందించారు. ఈ సినిమాలో 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా సంఘటనలో జరిగిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాలో నటించిన సయ్యద్ మసూద్ అనే పాత్రకి సంబంధించి అతడి కుటుంబాన్ని ఒక వర్గానికి చెందిన నాయకుడు చంపడంతో పాటు హత్యాచారం చేయడం.. ఆ తర్వాత అతడు రాజకీయ రంగంలోకి ప్రవేశించి పెద్ద నాయకుడిగా ఎదగడం చూపించారు. ఒక సినిమాని తమకు నచ్చిన రీతిలో ఊహించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. కాబట్టి, వారు తమకు నచ్చినట్లు ఊహించుకోనివ్వండి. నేను మాత్రం ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటాను అని ఆయన పేర్కొన్నారు.

- March 29, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor