శోభ‌నం రోజు మద్యం తాగిన పెళ్లికూతురు..!

శోభ‌నం రోజు మద్యం తాగిన పెళ్లికూతురు..!

మ‌ల‌యాళం సినిమా మందాకిని తాజాగా తెలుగు ఓటీటీలోకి వ‌చ్చేసింది.  గ‌త వారం ఓటీటీలోకి వ‌చ్చిన పోన్మ‌న్, రేఖ‌చిత్రం, ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ ఓటీటీలో దుమ్మురేపుతుంటే తాజాగా మ‌రో సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. మ‌ల‌యాళ యువ న‌టులు అల్తాఫ్ సలీమ్ – అనార్కలి మరిక్కర్ జంటగా నటించిన సినిమా మందాకిని. ఈ సినిమాకు వినోద్ లీలా దర్శకత్వం వహించారు. గతేడాది మేలో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా మ‌ల‌యాళ వెర్ష‌న్ ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ని తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ విడుద‌ల చేసింది. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. అరోమల్ (అల్తాఫ్ సలీమ్), అంబిలి (అనార్కలి మరిక్కర్) ఇద్దరి వివాహం పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. దీంతో వారి ఫ‌స్ట్ నైట్‌ను కూడా సంప్రదాయ పద్ధతుల్లోనే ఏర్పాట్లు చేస్తారు పెద్ద‌లు. కానీ, అరోమల్ స్నేహితులు అత‌డిని సరదాగా ఓ ఆట ఆడుకోవాల‌ని, కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి అతని గదికి పంపుతారు. అయితే, ఆ పానీయాన్ని పొరపాటున అరోమల్ కాకుండా అంబిలి తాగేస్తుంది. మద్యం మత్తులో ఉన్న ఆమె, తన వివాహానికి ముందు జీవితంలో జరిగిన ప్రేమ కథను వివరంగా చెప్పడం మొదలుపెడుతుంది. ఈ సంఘటన వల్ల అరోమల్ జీవితంలో ఏం జ‌రుగుతుంది అనేది సినిమా క‌థ‌.

editor

Related Articles