బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు క్రిష్ 4కి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాని గతం కన్నా మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని అనుకుంటున్నట్టు రాకేష్ రోషన్ తెలిపారు. `కోయి మిల్ గయా`లో సందడి చేసిన జాదూ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. అలాగే `క్రిష్ -4` పూర్తిగా అంతరిక్షంలో జరిగే అద్భుతమని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసే డైరెక్టర్ విషయంలో కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. రాకేష్ రోషన్ తెరకెక్కిస్తారా, లేకుంటే కొత్త దర్శకుడిని తెరపైకి తీసుకు వస్తారా అన్న సందేహం అందరి మదిలో మెదిలింది. ఈ క్రమంలో క్రిష్ 4 కోసం హీరోనే డైరెక్టర్‌గా మారుతుడున్నాడు. హృతిక్ రోషన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్య చోప్రా – రాకేష్ రోషన్ -హృతిక్ రోషన్ ముగ్గురు డిస్కస్ చేసుకున్న అనంతరం హృతిక్ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ హృతిక్ రోషన్ డైరెక్షన్‌లో ఒక్క సినిమా రాలేదు.

- March 28, 2025
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor