మేఘాలు చెప్పిన ప్రేమకథ

మేఘాలు చెప్పిన ప్రేమకథ

మత్తువదలరా, వికటకవి సినిమాలతో ఆకట్టుకున్న నరేష్‌ అగస్త్య హీరోగా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ పేరుతో ఓ మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా రూపొందుతోంది. విపిన్‌ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయనున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని గురువారం మేకర్స్‌ విడుదల చేశారు. నాయకా నాయికలు నరేష్‌ అగస్త్య, రబియా ఖాతూన్‌ అందంగా నవ్వుతూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఇది రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ అని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చెప్పకనే చెబుతోంది. పోస్టర్‌లోని పొగమంచు, ప్రశాంతమైన కొండప్రాంతం.. ఓ అందమైన గిటార్‌.. ఇవన్నీ ఇది సంగీత నేపథ్యంలో సాగే ప్రేమకథ అని చెబుతున్నాయి. సుమన్‌, ఆమని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: మోహన్‌కృష్ణ, సంగీతం: జస్టిస్‌ ప్రభాకరన్‌.

editor

Related Articles