ఈ సినిమాతో నాకు అనుబంధం.. ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఈ సినిమాతో నాకు అనుబంధం.. ఎమ్మెల్యే మల్లారెడ్డి

కొన్నేళ్ల విరామం తర్వాత గాయకుడు ఎస్పీ చరణ్‌ నటుడిగా నటించిన చిత్రం ‘లైఫ్‌’ (లవ్‌ యువర్‌ ఫాదర్‌). పవన్‌ కేతరాజు దర్శకుడు. కిషోర్‌ రాఠీ, మహేష్‌ రాఠీ, రామస్వామిరెడ్డి నిర్మాతలు. శ్రీహర్ష, కషిక కపూర్‌ జంటగా నటించారు. ఏప్రిల్‌ 14న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎమ్మేల్యే మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించిన యువజంట శ్రీహర్ష, కషిక కపూర్‌ చూడ ముచ్చటగా ఉన్నారు. శ్రీహర్ష మా కాలేజీ స్టూడెంట్‌. ఆమె తండ్రి మా కాలేజీ ప్రిన్సిపల్‌. కాబట్టి ఈ సినిమాతో నాకు మంచి అనుబంధం ఉన్నట్టే. అందుకే ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాను. దర్శకుడు పవన్‌ కేతరాజు మంచి సినిమానే తీస్తాడని నమ్ముతున్నా. సినిమా పెద్ద విజయం సాధించాలి.’ అని శుభాకాంక్షలు అందించారు. ఎస్పీ చరణ్‌ ఈ సినిమా చేయబట్టే ఈ సినిమా ఇంతబాగా వచ్చిందని, ఎస్పీబాలుగారు చరణ్‌ని మనకు బహుమతిగా ఇచ్చారని, ఆయన నటించిన ప్రతి సన్నివేశాన్నీ ఎంజాయ్‌ చేశానని దర్శకుడు పవన్‌ కేతరాజు కొనియాడారు. తన పాత్రను డిజైన్‌ చేసిన దర్శకుడికి ఎస్పీ చరణ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులోని యువజంట శ్రీహర్ష, కషిక చాలా కష్టపడ్డారని, ఈ సినిమాతో వారికి తప్పక విజయం లభిస్తుందని ఎస్పీ చరణ్‌ ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా చిత్రయూనిట్‌ మొత్తం మాట్లాడారు. ప్రవీణ్‌, ఛత్రపత్రి శేఖర్‌, రఘుబాబు, భద్రం, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: మణిశర్మ.

editor

Related Articles