నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ దర్శకుడు శేఖర్ కమ్ముల విద్యార్థులకు మద్దతుగా స్పందించారు. సీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో శేఖర్ కమ్ముల, నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని కోరారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం స్వయంగా పరిహారం అందించాలని అన్నారు.
విద్యార్థులు న్యాయమైన డిమాండ్ల కోసం లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం వారి మాట వినాలని, వారికి భరోసా కల్పించాలని కోరారు. “మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టే” అంటూ విద్యార్థుల పోరాటానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. చివరగా, “విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నా” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

