ఘట్టమనేని జై కృష్ణ, రాషా తడాని హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. కథ విషయానికి వస్తే.. తిరుపతికి వచ్చిన శ్రీను, పెద్దిరెడ్డి కుమార్తె మంగను ప్రేమిస్తాడు. అయితే ఆమె జీవితానికి సంబంధించిన ఓ రహస్యం కథను మలుపు తిప్పుతుంది. ఆ రహస్యం ఏమిటి? శ్రీను- మంగ ప్రేమ గమ్యం చేరిందా? అనేదే సినిమా.
సినిమాలో ప్రధాన బలం లవ్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు. జై కృష్ణ, రాషా తడాని తొలి చిత్రమైనప్పటికీ ఆకట్టుకునే నటన కనబరిచారు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని భావోద్వేగ సన్నివేశాలు మెప్పిస్తాయి. మోహన్ బాబు తన అనుభవంతో పాత్రకు బలం చేకూర్చగా, బ్రహ్మాజీ, నరేష్ వినోదాన్ని పంచారు.
అయితే కథలో కొత్తదనం లేకపోవడం, ఫస్టాఫ్‌లో నెమ్మదిగా సాగే కథనం, కొన్ని రొటీన్ సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా నిలిచాయి. పాటల సంఖ్య కూడా కొంత ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తంగా, ‘శ్రీనివాస మంగాపురం’ కొత్త కథను ఆశించే వారికి కాకుండా, ఎమోషనల్ లవ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ సినిమాగా చెప్పొచ్చు.

