హనుమంతుడి ఎంట్రీ కోసం అభిమానుల ఆసక్తి

హనుమంతుడి ఎంట్రీ కోసం అభిమానుల ఆసక్తి

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ భారీ పౌరాణిక సినిమా ‘రామాయణం’ ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను సొంతం చేసుకుంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ ట్రైలర్‌లోని విజువల్స్, గ్రాఫిక్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానుల్లో ఓ ప్రశ్న మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్న సన్నీ డియోల్‌కు సంబంధించిన ఒక్క గ్లింప్స్ కూడా ట్రైలర్‌లో కనిపించకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడి బాల్యం, సీతారాముల వివాహం, వనవాసం, రావణుడి పాత్ర వంటి కీలక సన్నివేశాలు చూపించినప్పటికీ హనుమంతుడిని పూర్తిగా దాచిపెట్టారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మొదటి భాగం కథ ప్రధానంగా సీతారాముల వివాహం, వనవాసం, సీతాపహరణం చుట్టూ సాగనున్న నేపథ్యంలో హనుమంతుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను మేకర్స్ ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అభిమానులు కనీసం హనుమంతుడి పోస్టర్ లేదా ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయాలని కోరుతున్నారు.

Related Articles