పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ..

పుష్ప 2 టికెట్ ధరలు పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ..

హీరో అల్లు అర్జున్ మెయిన్ రోల్‌గా పోషిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 ది రూల్ సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. డిసెంబ‌ర్ 4న రా.9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి ఒంటిగంట షోల‌కు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ల్లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800 గా ఖరారు చేసింది. మ‌రోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 5 నుండి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకోడానికి పర్మిషన్‌ ఇచ్చింది.

editor

Related Articles