నటి నజ్రియా నజీమ్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందమే అసూయ పడేలా ఉన్న ఈ ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో ఆమెపై అనేక రూమర్స్ వచ్చాయి. తాజాగా నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ అసలు కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా కొంతకాలం దూరంగా ఉన్నానని తెలిపింది. ఈ సమయంలో స్నేహితులు, సహనటుల కాల్స్‌కు కూడా స్పందించలేకపోయానని, అందుకు క్షమాపణలు చెప్పింది. తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని అభిమానులను కోరింది. ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. నజ్రియా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె రీ-ఎంట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
- May 14, 2026
0
137
Less than a minute
You can share this post!
editor

