ఊహకందని పాత్రను పోషిస్తున్న అలియాభట్

ఊహకందని పాత్రను పోషిస్తున్న అలియాభట్

సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియాభట్‌ చేస్తున్న సినిమా ‘లవ్‌ అండ్‌ వార్‌’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. అలియా, విక్కీ కౌశల్‌పై కీలక సన్నివేశాలను బన్సాలీ తెరకెక్కిస్తున్నారు. రణబీర్‌ కపూర్‌ ఇందులో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల అలియా మీడియాతో మాట్లాడింది. ‘లవ్‌ అండ్‌ వార్‌’ ఓ పిరియాడిక్‌ డ్రామా. ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించే పనిలో ఉన్నారు సంజయ్‌లీలా బన్సాలీ. ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి తీసుకెళ్లనున్నారాయన. ఆయన దర్శకత్వంలో మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి కేరక్టర్‌ని ఎవరూ ఊహించరు. నటిగా నాలోని కొత్తకోణాన్ని ‘గంగూభాయ్‌’ ఆవిష్కరించింది. అలాగే ఈ సినిమాలో కూడా కొత్త అలియాను చూస్తారు. 2026 మార్చి 20 వరకూ ఈ సినిమా కోసం వెయిట్‌ చేయండి.’

editor

Related Articles