హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో సంబరాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ రూపొందిన ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి తేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా నటించగా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఈ నెల 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తమ టీమ్ కృషి వల్లే ఈ సినిమా మంచి క్వాలిటీతో తెరకెక్కిందన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఆహాలో మరింత మంది చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా త్వరలో తెలియజేస్తానని తెలిపారు.
- May 14, 2026
0
9
Less than a minute
You can share this post!
editor

