టాలీవుడ్ హీరో నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. చందూమొండేటి డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 2018లో గుజరాత్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. తాజాగా బన్నీవాసు అండ్ తండేల్ టీం దివంగత మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్‌ను కలిసింది. ఇంతకీ వీరంతా ఎందుకు కలిశారో తెలుసా..? 2017 – 2018 కాలంలో పాకిస్థానీ జైళ్లలో చిక్కుకుపోయిన మత్స్యకారులను వెనక్కి తీసుకురావడంలో మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించారని తెలిసిందే. సుష్మా స్వరాజ్ చిరస్మరణీయ సేవలను గుర్తు చేసుకుంటూ తండేల్ టైటిల్ కార్డ్స్‌లో ఆమె పేరును షేర్ చేసేందుకు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలియజేయడానికి కలిసింది.

- January 31, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor