ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన హీరోయిన్ ఇమాన్వీ

ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన హీరోయిన్ ఇమాన్వీ

హీరో ప్రభాస్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి హను రాఘవపూడి  డైరెక్ట్‌ చేస్తున్న `ఫౌజీ`. ఈ సినిమాలో ఇమాన్వీ  ఫిమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. కాగా ప్రభాస్ ఇంటి నుండి పసందైన రుచులతో కూడిన భోజనం సెట్స్‌కు వస్తుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ తన ఆతిథ్యంతో ఊపిరాడకుండా చేస్తాడని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు చాలా సందర్భాల్లో చెప్పారు. కాగా ఇప్పుడు ప్రభాస్‌ ఇంటి విందుకు ఫిదా అయిపోయిన వారి జాబితాలో ఫౌజీ హీరోయిన్‌ కూడా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సెట్స్‌లో బ్రేక్ టైంలో ప్రభాస్‌ కిచెన్‌లో వండిన హోం ఫుడ్‌ను ఆరగించింది ఇమాన్వీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో గ్లింప్స్ షేర్ చేసింది. రుచికరమైన యమ్మీ యమ్మీ భోజనం రుచి చూపించిన ప్రభాస్‌కు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్‌ పెట్టింది.

editor

Related Articles