నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఫిమేల్ లీడ్‌లో పలు వాస్తవ సంఘటనలు ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “తండేల్”. మరి ఎన్నో అంచనాల నడుమ రిలీజ్‌కి వచ్చిన ఈ సినిమా సాలిడ్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా డే 1 పై కూడా చాలా నమ్మకం అక్కినేని ఫ్యాన్స్ పెట్టుకున్నారు. దీంతో వాటికి రీచ్ అయ్యేలా సాలిడ్ నెంబర్ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. డే 1కి గాను 21.27 కోట్ల గ్రాస్‌ని అందుకున్నట్టుగా మేకర్స్ ఇపుడు అఫీషియల్ నెంబర్ రివీల్ చేశారు. దీంతో నాగ చైతన్య కెరీర్లో ఇది రికార్డు నెంబర్‌గా నిలిచింది అని చెప్పాలి. మరి డే 2 అండ్ 3 లలో కలెక్షన్ల పరంగా ఎలా ఉంటాయో కూడా చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

- February 8, 2025
0
22
Less than a minute
Tags:
You can share this post!
editor