చాలా మంచి భవిష్యత్ ఉన్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఊహించని విధంగా ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయాడు. అయితే మొదట్లో ఈ కేసు ఆత్మహత్యగా భావించిన, ఆ తరువాత వచ్చిన ఆరోపణలతో దీనిపై ప్రభుత్వం కూడా సీబీఐతో దర్యాప్తు చేయించింది. ముంబైలోని తన నివాసంలో మృతి చెందిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టుకు క్లోజర్ నివేదిక సమర్పించడంతో వారు ఫైనల్‌గా దీనిని ఆత్మహత్య అని తేల్చారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, దొంగతనం వంటి ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు సాగించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆమోదం తెలపడంతో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయాలని 19 ఆగస్టు 2020న ఆదేశించింది. కోర్ట్ ఆదేశాలతో విచారణ సాగించి మార్చి 22, 2025న తుది నివేదికని కోర్టుకి సమర్పించింది. అయితే సీబీఐ నివేదికలో ఏం తెలియజేసింది అంటే… సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అతనే ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరూ అతన్ని చనిపోయేలా బలవంతం చేయలేదు అని తెలిపింది. అలానే రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ. ఇందులో ఎటువంటి నేర కోణం లేదా కుట్ర గాని జరగలేదు. సోషల్ మీడియా చాట్‌లను దర్యాప్తు కోసం అమెరికాకు పంపించగా, అక్కడ కూడా ట్యాంపరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏం లభించలేదు. మరోవైపు సుశాంత్‌పై విషప్రయోగం జరిగిందని, గొంతు కోసి చంపేశారనే ఆరోపణలను ఏఐఐఎంఎస్ ఫోరెన్సిక్ నిపుణులు తోసిపుచ్చగా, దీనిపై కూడా దర్యాప్తు చేసింది సీబీఐ ఏది ఏమైన భవిష్యత్ ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడం ఇప్పటికీ అభిమానులని భాదిస్తోంది. డిప్రెషన్ వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూసినట్టు అందరూ భావిస్తున్నారు.

- March 23, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor