దర్శకుడు ఎస్‌జే సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దర్శకుడిగా ఖుషి సినిమాకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో.. నటుడిగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు సూర్య. ఇప్పుడు ఆయన `వీర ధీర శూర` సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. విక్రమ్ హీరోగా నటించిన సినిమా మార్చి 27న విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో టీమ్ సందడి చేసింది. సినిమాలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. పోలీసాఫీసర్ క్యారక్టర్‌లో సూర్య కనిపించనున్నారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ ఖుషీ రోజులు కూడా గుర్తు చేసుకున్నారు.. ఖుషి సినిమాకి దర్శకత్వం వహించిన సమయంలో ఖుషి సినిమా కాపీ చూసి సినిమా బాగుందని గాని బాగాలేదని గాని ఎవరూ చెప్పకపోవడంతో చాలా బాధపడ్డాను. అయితే మొదటి రోజు సినిమా విడుదలయ్యాక కూడా సినిమా గురించి పెద్దగా ప్రస్తావన లేదు. తమిళ వెర్షన్ ఫస్ట్ కాపీని చెన్నైలో ఉదయం థియేటర్లో వేశాము. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. ఏదో స్మశానంలో ఉన్నట్లు ఎవరూ కూడా ఎలాంటి స్పందన లేకుండా కూర్చొని ఉన్నారు. నవ్వు కూడా ఎవరి ముఖంలో కనిపించలేదు. అదే అలా కంటిన్యూ అయి ఉంటే నేను సూసైడ్ చేసుకొని ఉండేవాడిని. ఎందుకంటే కొంచెం నాకు పిచ్చి ఉందని సూర్య తెలియజేశాడు. అయితే రెండో రోజు నుండి ఖుషి సినిమాకి బ్రహ్మరధం పట్టారు జనాలు. అయితే ఈ సినిమా మొదటి రోజు టాక్ ఎలా అయితే ఉందో రెండో రోజు అలా ఉండి ఉంటే మాత్రం చనిపోయేవాడిని.. కానీ నా అదృష్టం కొద్దీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

- March 23, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor