స్టార్ హీరోలు ద్విపాత్రాభినయాలు చేయడం మామూలే. అయితే.. ఆ రెండు పాత్రల్లో ఒకటి విలన్ పాత్ర అయితే.. అది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోలు దక్షిణాదిలో చాలా తక్కువమంది. పాత రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ ఈ తరహా సాహసాలు చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ‘వాలి’ సినిమాలో అజిత్, ‘జై లవకుశ’లో తారక్ ఈ తరహా పాత్రలు చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ సాహసాన్ని అల్లు అర్జున్ కూడా చేయబోతున్నారట. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త ఇప్పటికే ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వాటిలో ఓ పాత్ర పూర్తి నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందట. కథలో విలన్ కూడా ఆ పాత్రే అని సమాచారం. అంటే హీరో బన్నీనే.. విలనూ బన్నీనే. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్నాయట. త్వరలోనే బన్నీ ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది. ఆయన వచ్చాక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తారట.

- March 23, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor