‘రెట్రో’ లాభాల నుండి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చిన సూర్య

‘రెట్రో’ లాభాల నుండి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చిన సూర్య

తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా తాజాగా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన విష‌యం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఫ‌స్ట్ షో నుండే మిశ్ర‌మ స్పంద‌న‌ల‌ను అందుకున్న విష‌యం తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చినా త‌మిళంలో మాత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇటీవ‌ల‌ ఈ సినిమా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే ‘రెట్రో’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య‌.. ఈ సినిమా లాభాల నుండి రూ. 10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తన అగరం ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల విద్య కోసం అందజేశారు.

editor

Related Articles