‘మందిర’ సినిమా ప్రధాన పాత్రలో న‌టిస్తున్న స‌న్నీ లియోన్‌..

‘మందిర’ సినిమా ప్రధాన పాత్రలో న‌టిస్తున్న స‌న్నీ లియోన్‌..

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రెంట్ తీగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామెడీ, హార‌ర్ ఇలా అన్ని జాన‌ర్ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మ‌రోసారి భ‌య‌పెట్టేందుకు వ‌స్తోంది. మందిర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడ‌తాను అంటోంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న సినిమా ‘మందిర’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్ యువన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది.

ఇప్పటికే మందిర సినిమా నుండి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. తాజాగా సినిమా బృందం రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమాని నవంబర్ 22న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. జావెద్ రియాజ్ సంగీతం అందించగా త‌మిళ‌ యాక్టర్ యోగిబాబు కీల‌క పాత్ర‌లో న‌టించారు.

administrator

Related Articles