ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అమీర్‌ఖాన్. లగాన్, గజినీ, పీకే, దంగల్‌తోపాటు ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన ఈ స్టార్ యాక్టర్ చాలాకాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు అమీర్‌ఖాన్. నేను రాబోయే 10 సంవత్సరాలు చురుకుగా పనిచేయగలనని అనుకుంటున్నా. నా కెరీర్‌ను మరింత ఉత్తమంగా ముందుకు తీసుకెళ్లగలనని నమ్మకం నాకుంది, అందుకే అమీర్‌ఖాన్ ప్రొడక్షన్‌కు అపర్ణ పురోహిత్‌ని చీఫ్‌గా తీసుకువచ్చా. యువ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు నా ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అమీర్‌ఖాన్. ఇప్పుడీ కామెంట్స్ అమీర్ ఖాన్ నుండి వచ్చే పదేళ్లపాటు సినిమాల అప్‌డేట్స్ ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. పఠాన్ ఎండింగ్‌లో వచ్చే ట్రైన్ ట్రాక్ సీన్ గురించి మాట్లాడుతూ.. ఈ సీన్‌ను చూశా. చాలా బాగా వచ్చింది అని చెప్పిన అమీర్ ఖాన్.

- November 12, 2024
0
43
Less than a minute
Tags:
You can share this post!
administrator