యువ హీరో సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా పోస్టర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ఈ ఫాంటసీ ఫారెస్ట్ అడ్వంచర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ముందే ఆసక్తి రేపింది. తాజాగా విడుదలైన బర్త్ డే పోస్టర్లో బిడ్డ, ఖడ్గం, సింహం వంటి ఎలిమెంట్స్ కనిపిస్తూ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచాయి. ఇందులో సందీప్ కిషన్ సింహంలాంటి యోధుడిగా కనిపించనున్నట్లు హింట్ ఇచ్చారు. “ఏ లెజెండ్ ఈజ్ బార్న్” అనే ట్యాగ్‌లైన్ అంచనాలను మరింత పెంచుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా, ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
- May 7, 2026
0
15
Less than a minute
You can share this post!
editor

