‘M4M (Motive For Murder)’ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో తెరకెక్కించారు. అమెరికన్ నటి Jo Sharma ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే 15 అంతర్జాతీయ అవార్డులు సాధించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్విస్టులు, టర్న్స్‌తో నిండిన ఈ కథలో సీరియల్ కిల్లర్ ఎవరో కనుక్కుంటే లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. కేవలం 90 నిమిషాల నిడివితో హాలీవుడ్ స్టైల్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. కొత్తదనం, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ‘M4M’ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠగా ఉంచుతుందని దర్శకుడు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
- May 8, 2026
0
9
Less than a minute
You can share this post!
editor

