మనిషే కాదు.. శ్రీలీల మనసు కూడా బంగారమే. రెండేళ్ల క్రితం దివ్యాంగులైన ఇద్దరు పిల్లల్ని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నదట శ్రీలీల. వారి భవిష్యత్తుకు అండగా నిలవడమే కాక, వారి ప్రతి విషయాన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటోందట. గురు, శోభిత ఆ పిల్లల పేర్లు. స్టార్‌డమ్ కారణంగా శ్రీలీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. నితిన్‌కి జోడీగా ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. అలాగే.. హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ బాలీవుడ్ సినిమాలో నటించనున్నది శ్రీలీల. అనురాగ్ బసు దర్శకత్వంలో భూషణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ సినిమా.. ‘ఆషికీ 3’ అని బాలీవుడ్‌లో కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

- March 15, 2025
0
30
Less than a minute
Tags:
You can share this post!
editor