“కన్నప్ప”లో ప్రభాస్ డామినేషన్ తీరు ఎక్కువే..

“కన్నప్ప”లో ప్రభాస్ డామినేషన్ తీరు ఎక్కువే..

హీరో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో తాను హీరోగా నటిస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా తాను గెస్ట్ రోల్ చేస్తున్న సినిమా కూడా ఉంది. ఇలా ప్రభాస్ ఒక ఫుల్ బిజీ షెడ్యూల్‌లో కనిపిస్తుండగా తాను చేస్తున్న ఆ గెస్ట్ రోల్ సినిమానే “కన్నప్ప”. మంచు వారి హీరో మంచు విష్ణు హీరోగా తన డ్రీం ప్రాజెక్ట్‌గా చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రుద్రా అనే రోల్ చేస్తున్నాడు. అయితే ఈ పాత్రపై లేటెస్ట్‌గా మంచు విష్ణు కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రభాస్ నుండి ఒక స్ట్రైట్ సినిమాలో కనిపించే రోల్ కంటే కన్నప్పలో తాను చేస్తుంది గెస్ట్ రోల్ అయినప్పటికీ వాటిని మించిన ఇంపాక్ట్ ఈ సినిమాలో కనిపిస్తుంది అని తాను చాలా నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో కన్నప్పలో ప్రభాస్ రోల్ పట్ల అంచనాలు ఎక్కువే పెట్టుకోవచ్చని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సహా మరింతమంది బిగ్ స్టార్స్ నటిస్తుండగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఈ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమౌతోంది.

editor

Related Articles